తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఓడ్​ కులస్థుల క్షీరాభిషేకం - ఓడ్​ కులస్థులు

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్​లో ఓడ్​ కులస్థులు సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. 17 కులాల వారిని బీసీల్లో చేర్చడాన్ని ఓడ్​ కులస్థులు స్వాగతించారు.

nirmal people happy with cm kcr derision
nirmal people happy with cm kcr derision

By

Published : Sep 8, 2020, 1:39 PM IST

బీసీల జాబితాలోకి 17 కులాల వారిని చేర్చడాన్ని హర్షిస్తూ... నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్​లో ఓడ్ కులస్థులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అట్టడుగు జీవితాన్ని అనుభవిస్తున్న 17 కులాలను బీసీ జాబితాలో చేర్చడం చారిత్రాత్మక నిర్ణయమని మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తెలిపారు.

కొత్తగా బీసీల జాబితాలో చేర్చిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సంక్షేమ ఫలాలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, ఓడ్ కులస్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

ABOUT THE AUTHOR

...view details