నిర్మల్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో కారు జోరు సాగింది. జిల్లాలో మొత్తం 18 జడ్పీ స్థానాలు ఉండగా... 12 స్థానాల్లో తెరాసే విజయకేతనం ఎగువవేసి.. జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు ఒక్క స్థానం కైవసం చేసుకున్నారు. భాజపా మాత్రం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది.
మరోవైపు ఎంపీటీసీ స్థానాల్లో కూడా తెరాస సత్తా చాటింది. జిల్లాలో మొత్తం 156 స్థానాలు ఉండగా... 85 స్థానాల్లో కారు పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ 51 స్థానాలు, భాజపా 6 స్థానాలను గెలుచుకున్నాయి. ఇతరులు 14 స్థానాలను గెలుచుకున్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస గెలుపుతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు.
తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం | |
జడ్పీటీసీ | 12 | 5 | 0 | 1 | 18 |
ఎంపీటీసీ | 85 | 51 | 6 | 14 | 156 |