నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో పిప్రి ఎత్తిపోతల పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో సీఎంను కలిసిన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి... నియోజకవర్గానికి చెందిన పలు అంశాలను ప్రస్తావించారు. వాటిపై సానుకూలంగా స్పందించిన సీఎం... గడ్డన్నవాగు ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన పది కిలోమీటర్ల పొడవు సీసీ కాల్వను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
పిప్రి ఎత్తిపోతల పనులు చేపట్టండి: సీఎం కేసీఆర్ - Telangana news
హైదరాబాద్ ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

పిప్రి ఎత్తిపోతల పనులను చేపట్టండి: సీఎం కేసీఆర్
కూలిపోయే దశలో ఉన్న అర్లివంతెన పునర్మిర్మాణ పనులను చేపట్టాలని, ముంపునకు గురయ్యే గుండెగావ్ గ్రామ ప్రజలను ఆదుకునేందుకు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:దా'రుణ' యాపుల్లో డ్రాగన్ వ్యక్తులదే కీలక పాత్ర...
Last Updated : Dec 31, 2020, 5:43 PM IST