తెలంగాణ

telangana

ETV Bharat / state

మోకాళ్లపై నిలబడి రైతులకు మద్దతు - దిల్లీలో రైతులు నిరసన

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నిర్మల్ జిల్లా కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాల్గొని రైతులకు మోకాళ్లపై నిలబడి మద్దతు తెలిపారు.

nirmal-left-party-leaders-support-farmers-standing-on-their-knees
మోకాళ్లపై నిలబడి రైతులకు మద్దతు

By

Published : Dec 17, 2020, 7:18 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే తీసుకువచ్చారని అఖిల భారత రైతు కూలీ సంఘం నిర్మల్ జిల్లా కార్యదర్శి జె.రాజు ఆరోపించారు. దిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా.. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. చట్టాలను రద్దు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

చట్టాలు రైతులకు ఏమాత్రం మేలు చేసేలా లేవని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నూతన్ పేర్కొన్నారు. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'చట్టం అమలైతే రైతులు కూలీలే'

ABOUT THE AUTHOR

...view details