తెలంగాణ

telangana

ETV Bharat / state

వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ - నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు

రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లకు తరలించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.

nirmal jc visited paddy purchase center
వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

By

Published : May 10, 2021, 6:51 PM IST

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని న్యూ సాంగ్వీ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీటీ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారి రాథోడ్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

ఇవీ చదవండి:కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details