నిర్మల్ జిల్లా కుంటాల మండలం మేదన్పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు తనకు రావాల్సిన మొక్కజొన్న డబ్బులు చెల్లించాలంటూ పీఏసీఎస్ కార్యాలయం ఎదుట మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు. గ్రామానికి చెందిన సుభాష్ పటేల్... మొత్తం 382 బస్తాల మొక్కజొన్నలను పీఏసీఎస్ వారికి విక్రయించినట్లు తెలిపాడు.
నేను చస్తేనే... నా పంట డబ్బులు వస్తాయి.. - farmer attempted suicide in nirmal
తన తర్వాత అమ్మిన ప్రతి ఒక్కరికీ పంట డబ్బులు వచ్చాయని.. కేవలం తానొక్కడివే రాలేవంటూ ఓ రైతు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట మందు డబ్బాతో నిరసన చేశాడు. తాను చస్తేనే... తన కుటుంబానికి న్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
![నేను చస్తేనే... నా పంట డబ్బులు వస్తాయి.. nirmal farmer protet infront of pacs centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8044334-777-8044334-1594876120082.jpg)
నేను చస్తేనే... నా పంట డబ్బులు వస్తాయి..
అందుకుగాను అతనికి 3 లక్షల 65 వేల రూపాయలు రావాల్సి ఉండగా... ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకంటే వెనుక అమ్మిన వారికి డబ్బులు వచ్చాయని... కేవలం తనకు మాత్రమే ఇంకా డబ్బులు రాలేవని వాపోయాడు. తాను ఆత్మహత్య చేసుకుంటేనే... తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెబుతున్నాడు.