ప్రతీ ఒక్కరికి క్రీడలు ఎంతో అవసరమని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. క్రీడలు మన ఆరోగ్య పరిరక్షణలో ఒక భాగమని తెలిపిన ఎస్పీ... పోలీసులు శాంతిభద్రతల రక్షణ మాత్రమే కాకుండా క్రీడలతో ఉల్లాసం, ఉత్సాహం పొందాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్ కోర్టును ఎస్పీ శశిధర్‌రాజు ప్రారంభించారు.
'శాంతి భద్రతలే కాదు... పోలీసులు ఆటలు కూడా ఆడాలి'
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్ కోర్టును ఎస్పీ శశిధర్ రాజు ప్రారంభించారు. పోలీసులు శాంతిభద్రతల రక్షణ మాత్రమే కాకుండా క్రీడలతో ఉల్లాసం, ఉత్సాహం పొందాలని సూచించారు. క్రీడా ప్రాంగణాలను సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
'శాంతి భద్రతలే కాదు... పోలీసులు ఆటలు కూడా ఆడాలి'
క్రీడలు ప్రతీ పోలీసుకు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందిస్తాయని... విధినిర్వహణలో ఎటువంటి అలసట రాకుండా తోడ్పడతాయని ఎస్పీ తెలిపారు. క్రీడా ప్రాంగణాలను సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావు, డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్, సీఐలు జాన్ దివాకర్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.