ఆరోవిడత హరితహారాన్ని పురస్కరించుకోని నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో సిబ్బందితో కలిసి ఎస్పీ శశిధర్ రాజు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకుగాను ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం తమ వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
'మొక్కలను బహుమతి ఇవ్వడం అలవాటుగా మార్చుకోవాలి'
భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకుగాను ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజూన మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా అందించటం ఆనవాయితీగా మార్చుకోవాలన్నారు.
'మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ'
పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా అందించటం ఆనవాయితీగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పూర్తి కథనం:ప్రధాని పదవికే వన్నె తెచ్చిన 'పీవీ'