నిర్మల్ జిల్లా పెంబి గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ దరిచేరకుండా మారుమూల ప్రాంతాల్లో ప్రజలు తీసుకొంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
'కరోనా కట్టడికి మారుమూల గ్రామాలే ఆదర్శం' - Nirmal District SP Shashidhar Raju Distribute Essential goods to poor peoples
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మారుమూల ప్రాంతాల ప్రజలను పట్టణవాసులు ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. పెంబి గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
'కరోనా కట్టడికి మారుమూల గ్రామాలే ఆదర్శం'
పోలీసులు ఓ వైపు డ్యూటీ చేస్తూ మరోవైపు పేదలకు సేవ చేస్తున్నట్లు వివరించారు. అలాగే ప్రజలకు కరోనా బారి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలను వివరించారు. ప్రతిఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండి... వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎస్పీ శశిధర్ రాజు కోరారు.