తెలంగాణ

telangana

ETV Bharat / state

మారుమూల ప్రాంత ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎస్పీ - తెలంగాణ వార్తలు

లాక్​డౌన్​కు సహకరిస్తున్న మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. సమారిటన్స్ ఫర్ ది నేషన్, ప్రాజెక్ట్ అన్నపూర్ణ, లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, సినిమా ఆర్టిస్ట్ జీవన్ కుమార్ సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు.

మారుమూల ప్రాంత ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి:
మారుమూల ప్రాంత ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి:

By

Published : May 26, 2021, 8:44 PM IST

నిర్మల్​ జిల్లా కడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిగోపాల్​పూర్, కట్టకింది గూడం, గండి గూడం, చెరువు కింది గూడం, మిద్దచింత, రాంపూర్, మైసంపేట, ఉడుంపూర్ వాసులకు ఎస్పీ ప్రవీణ్ కుమార్​ సరకులు పంపిణీ చేశారు. హైదరాబాద్​కు చెందిన సమారిటన్స్ ఫర్ ది నేషన్, ప్రాజెక్ట్ అన్నపూర్ణ, లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, సినిమా ఆర్టిస్ట్ జీవన్ కుమార్ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆర్టిస్ట్ జీవన్ కుమార్ పెద్ద మనసుతో దాతల సహకారంతో నిత్యావసర సరకులు సమకూర్చడం అభినందనీయమన్నారు ఎస్పీ. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ పల్లెల దరిచేరకుండా ఇక్కడి ప్రజలు శ్రద్ధ తీసుకోవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ శ్రీధర్, కడం ఎస్ఐ రాజు, దస్తూరాబాద్ ఎస్ఐ రాహుల్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బంగాల్​లో 'యాస్'​ కల్లోలం- నీట మునిగిన ఆలయం

ABOUT THE AUTHOR

...view details