నిర్మల్ జిల్లాలో నివసిస్తున్న వలస కూలీలకు ఎస్పీ శశిధర్ రాజు చేయూతనందించారు. పశ్చిమ బెంగాల్ మాల్డా జిల్లాకు చెందిన వలస కూలీలను ప్రత్యేక వాహనంలో వారి వారి స్వస్థలాలకు పంపించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా కాలి నడకన వెళ్లే కూలీలను జిల్లా పోలీసుల ఆధ్వర్యములో తగు విధముగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
వలస కూలీలకు పోలీసుల చేయూత - నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు
వలస కూలీలను సురక్షితంగా సొంత రాష్ట్రాలకు పంపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాకు చెందిన వలస కూలీలను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలించారు.
వలస కూలీలకు పోలీసుల చేయూత
ప్రజలెవ్వరూ మాస్కులు లేకుండా బయటకు రావద్దని సూచించారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గంజల్ టోల్ ప్లాజా వద్ద వలస కూలీలకు భోజనం, పండ్లను పంపిణీ చేశారు.