జిల్లా వ్యాప్తంగా అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ముఖ్య అటవీ సంరక్షణ అధికారి వినోద్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టండి: కలెక్టర్ - అటవీ సంరక్షణపై జరిగిన సమావేశంలో పాల్గొన్న నిర్మల్ కలెక్టర్
టైగర్‌జోన్ పరిధిలోని ఆవాసాల ప్రజలకు వన్యప్రాణుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
కవ్వాల్ టైగర్ జోన్, అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత అధికారులతో కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టైగర్‌జోన్ పరిధిలోని ఆవాసాల ప్రజలకు వన్యప్రాణుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పునరావాసం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిసర గ్రామాలలో రెవెన్యూ, విద్యుత్, పంచాయితీరాజ్ సంబంధిత శాఖల అధికారులు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆజ్ఞాపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి అటవీశాఖ అధికారి శివాని, జిల్లా రెవెన్యూ ఇంఛార్జి అధికారి రాఠోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఎయిరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి కేటీఆర్