కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు అందుబాటులో ఉండటం లేదని నిర్మల్ జిల్లా సోన్ మండల రైతులు ఆందోళనకు దిగారు. గంజాల్ టోల్‌ప్లాజా వద్ద రహదారిపై బైఠాయించారు.
లారీల కోసం రోడ్డెక్కిన రైతులు - farmers protest in soan mandal
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్‌ప్లాజా వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
![లారీల కోసం రోడ్డెక్కిన రైతులు nirmal district farmers protest demanding lorries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7468380-17-7468380-1591251469678.jpg)
లారీల కోసం రోడ్డెక్కిన రైతులు
ఖాళీగా కనిపించిన లారీలు, డీసీఎంలను వాహన తనిఖీ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకెళ్లేలా వాహనదారులను ఒప్పించాలని పట్టుబడుతున్నారు. సమాచారం అందుకున్న సోన్ మండల పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.
రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు వినలేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి:స్పీడు పెంచిన కరోనా- పక్షంలోనే లక్ష కేసులు