తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిశుభ్రతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు' - telangana news

డంపింగ్ యార్డ్​లు, శెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

nirmal district District Collector Musharraf Farooq
'వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'

By

Published : Feb 4, 2021, 10:17 PM IST

నిర్మల్ జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన డంపింగ్ యార్డ్​లు, శెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మామడ మండలంలోని కొరటికల్, పోన్కల్, లక్ష్మణ చందా మండలంలోని చింతల్ చందా, చామన్ పల్లి గ్రామాల డంపింగ్ యార్డ్, షెడ్లను అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి పరిశీలించారు. వాటి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. ట్రాక్టర్​ల ద్వారా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని సూచించారు. వర్మి కంపోస్టు తయారీకి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో శెగ్రిగెషన్ షెడ్ల నిర్వహణను చేపట్టాలని ఆదేశించారు. వీటి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, తాహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవోలు రమేష్, గంగాధర్ సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై అధికారులతో సీఎం సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details