తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2020, 8:48 PM IST

ETV Bharat / state

పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు చేపట్టండి : కలెక్టర్

పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్, సీసీఐ, వ్యవసాయ శాఖల అధికారులతో నిర్మల్‌ కలెక్టర్‌ ముషర్రఫ్ ఫారూఖీ సమావేశం నిర్వహించారు. పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంట కొనుగోళ్లకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

nirmal district
nirmal district

రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్, సీసీఐ, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో 73,111మంది రైతులు లక్షా 69వేల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేస్తున్నారని తెలిపారు. సుమారు 1,34,400 మెట్రిక్ టన్నుల పత్తి పంట అక్టోబర్ మాసంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీసీఐ, కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు, ఇతర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కాంటాలను, తేమకొలిచే మిషన్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.

గ్రామాల వారీగా పంటను ఏ రోజున తీసుకురావాలో ముందస్తుగా రైతులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం పంట కొనుగోళ్లకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.

ఇదీ చదవండి :అలర్ట్​: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవద్దు..!!

ABOUT THE AUTHOR

...view details