తెలంగాణ

telangana

ETV Bharat / state

'జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి' - nirmal district collector

నిర్మల్ జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధి, విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.

Telangana News, Nirmal Collector Farooqi, Silk Industry in Nirmal District
తెలంగాణ వార్తలు, నిర్మల్ కలెక్టర్ ఫారూఖీ, నిర్మల్​ జిల్లాలో పట్టు పరిశ్రమ

By

Published : May 11, 2021, 6:26 PM IST

నిర్మల్ జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ హాలులో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ పురోగతి పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధి, విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. దీనికోసం రైతు వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా చేపడుతున్న పలు పథకాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శరత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details