తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయండి - కలెక్టర్ - collector Musharraf Farooqi rural development works

నిర్మల్ జిల్లాలో పల్లె ప్రగతి భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సాపూర్ మండలం లోని టెంబూర్ణి గ్రామ వైకుంఠ దామం, పంట కల్లాలను పరిశీలించిన ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

Complete rural development work expeditiously - Collector
పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయండి - కలెక్టర్

By

Published : Nov 23, 2020, 4:47 PM IST

నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండలం లోని టెంబూర్ణి గ్రామ వైకుంఠ దామం, పంట కల్లాలను సోమవారం కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే కలిసి పరిశీలించారు. పల్లె ప్రగతి లో భాగంగా చేపట్టిన పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి నిర్మాణ పనులను త్వరగతిన పూర్తి చేయాలని వారికి సూచించారు.

అనంతరం రాంపూర్ వరి కొనుగోలు కేంద్రంను పరిశీలించి.. నిర్వాహకులకు పలు సూచనలు చేశాారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపి డివో వనజ, అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details