తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి' - తెలంగాణ వార్తలు

ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారుఖీ కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని తెలిపారు.

nirmal district collector musharraf ali  on national voters day
ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి

By

Published : Jan 25, 2021, 7:09 PM IST

18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్​ ముషరఫ్ ఫారుఖీ సూచించారు. జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఒక్కరు విధిగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.

ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేయలనే లక్ష్యంతో ప్రతీ ఏటా ఓటర్ల నమోదు జాబితా కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్​ నిర్వహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

ఓటరు జాబితా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను, సీనియర్ సిటిజన్​లను కలెక్టర్​ సన్మానించారు. నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు పాలనాధికారి హేమంత్ బొర్కడే, డీఆర్వో రమేష్ రాఠోడ్ తహసీల్దార్లు, బీయల్ఓలు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:భారీ క్వారంటైన్​ కేంద్రం నిర్మిస్తున్న చైనా

ABOUT THE AUTHOR

...view details