ఈనెల ఆఖరివరకు వరిధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫౌరూఖీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్, ఎంపీడీవో, అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
'ఈనెల ఆఖరి వరకు కొనుగోలు పూర్తి చేయాలి' - Nirmal District Collector Musharraf Ali Farooqi review on grain purchase
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్, ఎంపీడీవో, అధికారులతో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫౌరూఖీ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల ఆఖరివరకు వరిధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

వరిధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించి... రోజువారి నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా సోన్, నిర్మల్ , సారంగాపూర్ మండలాల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని పేర్కొన్నారు. లారీలు అందుబాటులో లేనట్లయితే ట్రాక్టర్ల సహాయంతో ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేయాలని సూచించారు. గన్ని బ్యాగులు అన్ని కేంద్రాలకు పంపించడం జరిగిందని, ఎక్కడ కొరత లేదని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్లో ఎంట్రీ చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్లే గ్రౌండ్ కోసం రెండు ఎకరాల భూమిని గుర్తించాలని సూచించారు.
ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్