తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్​: కలెక్టర్ - నిర్మల్ కలెక్టర్ వార్తలు

అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులోగా ఆసరా పింఛన్లు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా రిపోర్టులు సైతం అందించాలన్నారు.

nirmal district collector musharaf ali review meeting with officials
'అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్​ అందాలి'

By

Published : Feb 4, 2021, 1:55 PM IST

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్​ ఆలీ ఫారూఖీ... గ్రామీణ అభివృద్ధి, తపాలశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో మొత్తం 1,40,989 మంది ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారని... వారిలో 1,31,749 మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన వారికి త్వరగతిన పింఛన్​ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల వారిగా ప్రతినెల పింఛన్​ల రిపోర్టును అందించాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, బీపీఎం సమన్వయంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

ఇదీ చూడండి:కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త

ABOUT THE AUTHOR

...view details