నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం జరిగిన అల్లర్లలో హిందువుల అక్రమ అరెస్టులు చేయడం ఆపాలని జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి పార్టీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. కోర్బగల్లీ మహిళలతో కలిసి దీక్ష కోసం వెళ్తుండగా... పోలీసులు అడ్డుకున్నారు. కోర్బ గల్లీలో ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'కోర్బ గల్లీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలి' - 'కోర్బ గల్లీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలి'
భైంసా అల్లర్లలో ఇళ్లు కోల్పోయన కోర్బ గల్లీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ... జిల్లా భాజపా అధ్యక్షురాలు నిరాహారదీక్ష చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకొని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
!['కోర్బ గల్లీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలి' bjp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5783550-902-5783550-1579584030297.jpg)
'కోర్బ గల్లీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలి'
ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి ఇప్పడి వరకు స్పందించకపోవడం బాధాకరమని రమాదేవి అన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు ఎలాంటి అరెస్టులు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో రమాదేవి నిరాహారదీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
'కోర్బ గల్లీ వాసులను ప్రభుత్వం ఆదుకోవాలి'
ఇవీ చూడండి: ఉన్నట్టుండి వారి వద్ద అంత డబ్బు ఎక్కడిది?