తెలంగాణ

telangana

ETV Bharat / state

పెన్షనర్లను ప్రతి ఒక్కరు గౌరవించాలి : ముషర్రఫ్​ ఫారూఖీ - జాతీయ పెన్షనర్ల దినోత్సవంలో కలెక్టర్​

కనీస సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు సేవలందించారని నిర్మల్​ జిల్లా పాలనాధికారి అన్నారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

nirmal dist collector attended in national pensioners day
పెన్షనర్లను ప్రతి ఒక్కరు గౌరవించాలి : ముషర్రఫ్​ ఫారూఖీ

By

Published : Dec 17, 2020, 5:35 PM IST

పెన్షనర్లను స్వాతంత్ర సమరయోధులతో సమానంగా గౌరవించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభను జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్​ ప్రారంభించారు. సమావేశంలో సీనియర్​ సిటిజన్లకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.

దేశానికి స్వాతంత్రం వచ్చాక మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలందించారని అన్నారు. జిల్లాలో 4560 మంది పెన్షనర్లకు నెలకు రూ.12 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్​ వెల్లడించారు. పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరు సమాజంలో ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు పార్కులలో వృద్ధాప్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెన్షనర్ల భవనానికి ప్రహరీ గోడ నిర్మించేందుకు కృషి చేస్తామని ముషర్రఫ్​ ఫారూఖీ తెలిపారు.

ఇదీ చూడండి:డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా

ABOUT THE AUTHOR

...view details