కరోనా రెండో దశను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి.. వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈనెల 30 లోగా టీకా తీసుకోవాలని ఆయన సూచించారు.
కరోనా కట్టడికి వ్యాక్సినేషనే ఏకైక మార్గం: కలెక్టర్ - నిర్మల్ కరోనా టీకా సెంటర్లు
కరోనా కట్టడికి వ్యాక్సినేషనే ఏకైక మార్గమని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా నిర్భయంగా టీకా తీసుకోవాలని సూచించారు. జిల్లాల్లో వ్యాక్సిన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
nirmal collector
జిల్లా వ్యాప్తంగా 45 సంవత్సరాలు పైబడిన వారిలో.. ఇప్పటివరకు లక్షా పది వేల మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. మే ఒకటో తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిన వారికీ వ్యాక్సిన్ను అందిస్తామని వివరించారు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా నిర్భయంగా టీకా తీసుకోవాలని ఆయన సూచించారు.