పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం, ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ సందర్శించారు. ప్రయాణ ప్రాంగణంలో ఉన్న మురికి కుంటను శుభ్రం చేసి... ఆ స్థలం ఉపయోగంలోకి వచ్చేలా చూడాలని పురపాలక అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలో పర్యటించిన నిర్మల్ కలెక్టర్ - నిర్మల్‌లో కలెక్టర్ పర్యటన
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ జిల్లా కేంద్రంలో పర్యటించారు. పురపాలక అధికారులకు పలు ఆదేశాలు చేశారు.
జిల్లా కేంద్రంలో పర్యటించిన నిర్మల్ కలెక్టర్
అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి... అక్కడి విద్యుత్ బోర్డులు మరమ్మతులు చేయించాలని సూచించారు. బాత్ రూమ్‌లకు తాళం వేసి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.