తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయండి' - పట్టణ ప్రగతి పనులపై నిర్మల్ కలెక్టర్ సమీక్ష

నిర్మల్ కలెక్టరేట్ లో పట్టణ ప్రగతి పనులపై పాలనాధికారి ముషర్రఫ్ ఫారూఖీ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.

'పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయండి'
'పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయండి'

By

Published : Nov 11, 2020, 5:08 PM IST

నిర్మల్ జిల్లాలోని మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో పట్టణ ప్రగతి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతిలో చేపట్టిన సుందరీకరణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.

ఆస్తిపన్ను వసూలుతో పాటు పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్లు, పరిసరాల పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న లే అవుట్లను, భవనాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు ఎన్. బాలకృష్ణ, ఎంఏ ఖాదీర్, గంగాధర్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గాలి వీచినా ఆరిపోని దీపాలు..

ABOUT THE AUTHOR

...view details