పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా పాలానాధికారి ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో పల్లె ప్రగతి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మండల, గ్రామాల వారీగా నిర్మాణంలోనున్న పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన స్మశాన వాటికలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాల పనులను అధికారులు, సర్పంచుల సమన్వయంతో వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచి త్వరతగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు.