పంట కల్లాల నిర్మాణాలను వారం లోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా (Nirmal collector) కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంట కల్లాల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు సరిగా పని చేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలను వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
Nirmal collector: 'పంట కల్లాల నిర్మాణాలు వారంలోగా పూర్తి చేయండి' - తెలంగాణ వార్తలు
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ (Nirmal collectorate)లో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంట కల్లాల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. త్వరతిగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు వారంలోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు నిర్మాణాల పురోగతిని ప్రతిరోజు పర్యవేక్షించి త్వరగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శంకరయ్య, ఎంపిడిఓలు, వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.