జిల్లాలో భూ సంబంధిత ఇతర ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని... నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు అధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి' - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
నిర్మల్ జిల్లాలో భూ సంబంధిత, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని... జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి'
మండల స్థాయిలో తహసీల్దార్‌లు సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. తమ పరిధిలో పరిష్కారం కాని వాటిని మాత్రమే కలెక్టర్ కార్యాలయానికి పంపించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 74 మంది పోటీ