తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం పకడ్బందీగా చేపట్టాలి : నిర్మల్ కలెక్టర్ - Niram News

జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని, ఆగస్టు 31నాటికి వందశాతం లక్ష్యం పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హరితహారం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Nirmal Collector Review Meeting On Haritha Haram
హరితహారం పకడ్బందీగా చేపట్టాలి : నిర్మల్ కలెక్టర్

By

Published : Aug 7, 2020, 6:06 PM IST

నిర్మల్​ జిల్లాలో హరితహారం కార్యక్రమం పకడ్బందీగా చేపట్టి.. నిర్దేశించిన లక్ష్యాన్ని, గడువు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్​ ముషర్రఫ్​ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అధికారులు సమన్వయంతో ఆరవ విడత హరితహారంలో జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి రోజు శాఖల వారిగా నాటిన మొక్కల వివరాలను ఆన్​లైన్​లో పొందుపరచాలన్నారు. ఆగస్టు 31నాటికీ ప్రతి శాఖ తమకు నిర్దేశించిన లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details