నిర్మల్ జిల్లాలో రూర్బన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి జూన్ 2న ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని.. కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రూర్బన్ పథకంలో భాగంగా కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలతో పాటు గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి పనులు జరగాలని సూచించారు.
రూర్బన్ పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ ముషర్రఫ్ - నిర్మల్లో రూర్బన్ పథకం పనులు
రూర్బన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులపై నిర్మల్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. జూన్2 లోగా అన్ని కార్యక్రమాలు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు.
రూర్బన్ పనులు వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ ఆదేశాలు
పలు అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ అధికారులు, కాంట్రాక్టర్ల సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. జూన్ 2న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 2 అంగన్వాడీ కేంద్రాలు, పార్కును ప్రారంభించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్ నివారణకు ఆయుష్ వైద్య విధానంలో చికిత్స