ప్రభుత్వ నిబంధనలు పాటించి, నాణ్యతా ప్రమాణాలకు లోబడి శనగ కొనుగోళ్లు చేయాలని... నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ తెలిపారు. సోమవారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు.
శనగ కొనుగోళ్లను పకడ్బందిగా చేప్టటాలి: కలెక్టర్ ముషర్రఫ్ - Nirmal district latest news
జిల్లాలో శనగ కొనుగోళ్లను పకడ్బందిగా చేపట్టాలని... నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
శనగ కొనుగోళ్లను పకడ్బందిగా చేప్టటాలి: కలెక్టర్ ముషర్రఫ్
కొనుగోళ్లను పకడ్బందిగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనగ క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 5,100 చెల్లించనున్నట్లు చెప్పారు. భైంసా, కుబీర్ మండలాలలో కొనుగోలు కేంద్రాలను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రెవెన్యూ, పోలీస్ అధికారులతో హెచ్చార్సీ ఛైర్‌పర్సన్ సమీక్ష