మొక్కల పెంపకంపై నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ సూచించారు. జిల్లాలోని దిలావర్ పూర్ మండల కేంద్రంలోని వన నర్సరీని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి ఆయన సందర్శించారు.
'మొక్కల పెంపకంలో జాగ్రత్తలు వహించండి'
నిర్మల్ జిల్లాలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సందర్శించారు. వన నిర్వాహకులకు పలు జాగ్రత్తలు సూచించారు. హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధం చేయాలని కోరారు.
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ
గ్రామాల్లోని వన నర్సరీల్లో పెంచుతున్న మొక్కల పట్ల నిర్లక్ష్యం వహించరాదని కోరారు. వేసవి తీవ్రతతో మొక్కలు ఎండి పోకుండా నర్సరీ పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జూన్ మాసంలో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేయాలన్నారు.
ఇదీ చదవండి:తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ: సీఎం