అభివృద్ధి పనుల పురోగతికి చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
'అభివృద్ధి పనుల పురోగతికి చర్యలు చేపట్టండి' - double bed rooms in nirmal
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతి తదితర అంశాలపై నిర్మల్ కలెక్టర్.. సంబంధిత అధికారులతో సమీక్షించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
జిల్లాలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని కలెక్టర్.. అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు పూర్తైన వాటికి.. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. అర్హులై ఉండి జాబితాలో లేనివారిని గుర్తించి.. వారికీ ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ రమేశ్, సర్వే శాఖ సహాయ సంచాలకులు దశరథ్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనాతో 10 మంది మావోయిస్టుల మృతి?