తెలంగాణ

telangana

ETV Bharat / state

నులి పురుగుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టండి: కలెక్టర్ - nirmal collector latest meeting

అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ ఆదేశించారు. నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని.. మాత్రలు వేయడం వల్ల వారి ఆరోగ్యం కాపాడవచ్చని తెలియజేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

nirmal collector musharaf farukhi on worms
నులి పురుగుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టండి: కలెక్టర్

By

Published : Sep 28, 2020, 10:52 PM IST

నులి పురుగుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్ములన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగుల మాత్రలు వేయాలని సూచించారు. వాటి సంక్రమణ వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతిని వారి పెరుగుదల, అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు.

నులి పురుగుల నివారణ మాత్రలను వేయడానికి జిల్లాలో 2లక్షల 50వేల మంది పిల్లలను గుర్తించామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.వసంత్ రావు తెలిపారు. వారందరికీ మాత్రలు అందేవిధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. అనంతరం జాతీయ నులి పురుగుల నిర్ములన కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలోని దస్తురాబాద్, దిలావర్ పూర్, ముజ్గి, సోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిసరాల పరిశుభ్రత, అధిక ప్రసవాల వంటి మెరుగైన వైద్య సేవలందించినందుకు.. జాతీయ నాణ్యతా హామీ కమిటీ అందించిన ప్రశంస పత్రాలను జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ వైద్యులకు అందించి అభినందించారు.

ఇదీ చూడండి:రైతు వేదికలు త్వరగా నిర్మించండి: కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ

ABOUT THE AUTHOR

...view details