తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్యం మేరకు రుణాలివ్వాలి  : నిర్మల్​ కలెక్టర్ - నిర్మల్​ కలెక్టర్​ ముషర్రఫ్ ఫారుఖీ

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం క్రింద అర్హులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ బ్యాంకు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రుణాల మంజూరుపై బ్యాంకు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

Nirmal Collector Meeting With bankers
లక్ష్యం మేరకు రుణాలివ్వాలి  : నిర్మల్​ కలెక్టర్

By

Published : Aug 7, 2020, 11:50 PM IST

నిర్మల్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి ముషార్రఫ్ ఫారూఖీ... బ్యాంకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆత్మ నిర్భర్​ భారత్​ అభియాన్​ పథకం కింద మంజూరు చేసే రుణాల అంశంపై అధికారులతో చర్చించారు. ఈ పథకం కింద అర్హులైన అందరికీ రుణాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అర్హులైన చిరు వ్యాపారులకు ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో రుణాలు మంజూరు చేయాలని, జిల్లాలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా అధికారులు, బ్యాంకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ హరిక్రిష్ణ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్​ జీవీ నర్సింహారెడ్డి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details