తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాంకర్లతో సమావేశమైన జిల్లా కలెక్టర్

నిర్మల్ జిల్లా కలెక్టరేట్​లో జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. పంట రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రెండు రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అయ్యేలా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు.

Collector meeting with bankers
Collector meeting with bankers

By

Published : May 20, 2020, 7:48 PM IST

పంట రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రెండు రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అయ్యేలా చూడాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో పంట రుణమాఫీ పథకంపై బ్యాంకుల వారీగా సమీక్షించారు. లాక్ డౌన్ సమయంలో బ్యాంకులు మెరుగైన సేవలు అందించినందుకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 25 వేల రూపాయలలోపు పంట రుణాలను మాఫీ చేసి నిధులను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఆ డబ్బులను అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అయ్యేలా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటివరకు ఎంతమంది లబ్ధిదారుల ఖాతాల్లోకి పంటల రుణమాఫీకి సంబంధించిన డబ్బులు బదిలీ అయ్యాయని, ఇంకా ఎంత మంది ఖాతాల్లోకి బదిలీ కావలసి ఉందని బ్యాంకుల వారీగా తెలుసుకున్నారు. లబ్ధిదారుల అకౌంట్లలో ఏమైనా లోపాలుంటే సరిదిద్ది పంట రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అకౌంట్లలో బదిలీ అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హరికృష్ణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details