తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి' - nirmal collector musharraf faruqui meeting with revenue officers

ప్రభుత్వ భూముల పరిరక్షణపై రెవెన్యూ శాఖ అధికారులతో నిర్మల్​ జిల్లా కలెక్టర్​ ముషర్రఫ్​ ఫారూఖీ.. కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

nirmal collector on government land occupations in district
'ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి'

By

Published : Aug 21, 2020, 8:34 PM IST

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూములు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్​ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల హద్దులను గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి మండల కార్యాలయంలో ఆర్టీఏ, మీ- సేవా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్​ అన్నారు.

ఇదీ చూడండి'యోగీ హయాంలో యూపీ​లో భారీగా తగ్గిన నేరాలు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details