తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ ఫోర్స్ కమిటీ - nirmal collector meeting on covid vaccine

నిర్మల్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కసరత్తులు జరుగుతున్నాయి. అందుకోసం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు.

nirmal collector meeting on covid vaccine
వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ ఫోర్స్ కమిటీ

By

Published : Dec 22, 2020, 9:11 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో.. సంబంధిత అధికారులతో పంపిణి విధివిధానాలపై చర్చించారు.

జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు

టీకా పంపిణీకి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీలో 17 శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. దీనికి జిల్లా పాలనాధికారి ఛైర్మెన్‌గా ..వైధ్యాధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

మెదట వారికే..

కొవిడ్ వ్యాక్సిన్ టీకా మొదట ప్రభుత్వ , ప్రైవేట్ వైద్య సిబ్బందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో విడతలో భాగంగా.. మున్సిపల్, పోలీస్ సిబ్బందితో పాటు 50 ఏళ్లు దాటిన, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పంపిణీ చేయనున్నారు. ఈ సమావేశంలో జిల్లా వైధ్యాదికారి ధన్‌రాజ్ , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పార్లమెంట్​ భవనానికి అంబేడ్కర్​ పేరు పెట్టాలి : జాజుల

ABOUT THE AUTHOR

...view details