నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు, నిరుపేదలకు 10వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలో రోడ్లు ఊడ్చే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
భైంసా మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రం ప్రారంభం
భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని నిర్మల్ జిల్లా పాలనాధికారి, ముధోల్ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు, నిరుపేదలకు 10వేల రూపాయల చెక్కులను అందజేశారు.
భైంసా మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రం ప్రారంభం
పట్టణప్రగతిలో భాగంగా భైంసా పట్టణానికి ఒక స్వీపింగ్ యంత్రాన్ని ఇచ్చామని జిల్లా కలెక్టర్ తెలిపారు. 3 నెలల నుంచి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఇవీ చూడండి: 'బస్తీ దవాఖానాలతో పేద ప్రజలకు మేలు'