తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి: భాజపా - Nirmal Bjp leaders Strike at District DMHO Office

కొవిడ్‌-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని నిర్మల్​లో భాజపా నాయకులు డిమాండ్​ చేశారు. లేదంటే ఆయుష్మాన్‌ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా బారిన పడిన పేదలకు ఉచితంగా చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

Nirmal Bjp leaders Strike at District DMHO Office
కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి

By

Published : Jun 22, 2020, 6:48 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని నిర్మల్ జిల్లా భాజాపా అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవటంతోనే కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ప్రజలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాపింగ్ సిస్టమ్ ఎత్తివేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో అనుమతికి మించి నాయకులు ఉండటంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో భాజపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details