పశ్చిమ బంగాల్ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ ఒక దారుణంగా వ్యవహరిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర కన్వీనర్ వెంకటేశ్ మండిపడ్డారు. భాజపా కార్యకర్తలపై టీఎంసీ నాయకుల దాడులను వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌లో ఆయన నిరసన వ్యక్తం చేశారు.
టీఎంసీ దాడులను వ్యతిరేకిస్తూ భాజపా నేతల నిరసన - BJP leaders protest against TMC attacks
బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర కన్వీనర్ వెంకటేశ్ మండిపడ్డారు. భాజపా కార్యకర్తలపై టీఎంసీ నాయకుల దాడులను వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ ఆయన ఆందోళన చేపట్టారు.
TMC attacks in west bengal
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్న దీదీ దుశ్చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వెంకటేశ్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనా కట్టడికి రాష్ట్రాల ఆంక్షల వ్యూహం