కరోనా సమయంలో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఇస్తామన్న 5 వేల పారితోషకం చెల్లించాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. చేతిలో ఫ్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా వచ్చిన సీఐటీయూ జిల్లా నాయకుడు దాదేమియాను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
లాక్డౌన్ సమయంలోని రూ.5 వేలు ఇవ్వాలని ఆశాల ఆందోళన - asha workers protest in nirmal
నిర్మల్లో ఆశా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహించిన తమకు... ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 5 వేల పారితోషికాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
నిర్మల్లో ఆశాకార్యకర్తల ఆందోళన
లాక్డౌన్ సమయంలో అందరూ ఇంటికే పరిమితమైతే... తాము మాత్రం ఇంటింటికీ తిరిగి సర్వే చేశామన్నారు. అందుకు అప్పట్లో 5 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. విధుల నిర్వహణలోనూ అధికారుల వేధింపులు పెరిగాయని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కలిపిస్తూ... ఆఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.