తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు' - Nirmal District Latest News

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఏంసీ ఛైర్మన్ నర్మద ముత్యం రెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు.

nirmal amc chairman muthyam reddy said Farmers should not be deceived by trusting agents
'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'

By

Published : Dec 4, 2020, 1:37 PM IST

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పండించిన పంటను విక్రయించు కోవాలని ఏఏంసీ ఛైర్మన్ నర్మద ముత్యం రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.

వరి ధాన్యం విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ముత్యం రెడ్డి అన్నారు. ఏ గ్రేడ్​కు రూ.1,888, బీ గ్రేడ్​కు రూ.1,868 మద్దతు ధరను చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఆ 3 చోట్ల ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్ల అభ్యంతరాలు...

ABOUT THE AUTHOR

...view details