నిర్మల్ జిల్లాలో కరోనా బాధితులను గుర్తించి.. వెంటనే వారికి ఈ-క్లీనిక్‌ల ద్వారా మెడికల్ కిట్‌లు అందజేయాలని అధికారులను అదనపు కలెక్టర్ హేమంత్ ఆదేశించారు. సోన్ మండలం గంజాల్ గ్రామంలో ఆయన పర్యటించారు. బాధితులను గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు.
'పాజిటివ్‌గా తేలితే మెడికల్ కిట్‌లు అందజేయండి' - nirmal corona news
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ గ్రామంలో అదనపు కలెక్టర్ హేమంత్ పర్యటించారు. కొవిడ్ బాధితులను గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. మహమ్మారి పట్ల ఆందోళన చెందకుండా.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
covid home survey
బాధితుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మహమ్మారి పట్ల ఆందోళన చెందకుండా.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్, సర్పంచ్ లావణ్య, పంచాయతీ కార్యదర్శి సుర్జీత్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:దుబ్బాకలో అకాల వర్షం.. మార్కెట్‌యార్డులో కొట్టుకుపోయిన ధాన్యం