నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులువీరికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో నేతి విద్యాసాగర్ రావు తన మనుమడు స్వానిక్, మనుమరాలు నేక్షకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆలయ ఈఓ వినోద్ రెడ్డి సమక్షంలో విద్యాసాగర్ రావును సన్మానించారు. వేద పండితులు వీరికి అమ్మవారి ప్రసాదంతో పాటు హారతులను ఇచ్చి మెమోంటోను అందజేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ వెంట నిజామాబాద్ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు ఉన్నారు.
బాసర సరస్వతి దేవిని దర్శించుకున్న మండలి డిప్యూటీ ఛైర్మన్ - ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న నేతి విద్యాసాగర్ రావు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారిని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
బాసర సరస్వతి దేవిని దర్శించుకున్న నేతి విద్యాసాగర్ రావు