నిర్మల్ జిల్లా కేంద్రం భీమన్న గుట్ట సమీపంలో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గుట్ట సమీపంలో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూమిలో రహదారి వేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూమిలో తమ పశువులను మేపే వాళ్లమని, అది ప్రభుత్వానికి చెందినదని... దానిలో పాగా వేసేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
'భూ బకాసురుల నుంచి సర్కారు భూమిని కాపాడండి' - Natives protest that state land should be protected from occupied
ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు దోచేస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమన్న గుట్ట సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు పాగా వేస్తున్నారంటూ ఆరోపించారు.

భూ బకాసురుల బారి నుంచి సర్కారు భూమిని కాపాడండి