తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసాలో జాతీయ బీసీ కమిషన్​ పర్యటన - భైంసా అల్లర్లు

భైంసాలో గత నెల 12 న అల్లర్లు జరిగిన ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు పర్యటించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

national bc commission visited bainsa
national bc commission visited bainsa

By

Published : Feb 3, 2020, 5:10 PM IST

Updated : Feb 3, 2020, 7:55 PM IST

భైంసా అల్లర్లకు కారకులైన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు ఆచారి తల్లోజు అన్నారు. స్థానికుల్లో ఇప్పటికి భయాందోళన పోలేదని... పోలీసులు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. భైంసాలో అల్లర్లు జరిగిన ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని పేర్కొన్నారు.

అల్లర్లలో రూ.3.93 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు నివేదించారు. 11 ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా రాళ్ల దాడిలో 23 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. దీనితో పాటు పలు వాహనాలు కాలి బూడిద అయినట్లు గుర్తించి పూర్తి నివేదికను ఉన్నత అధికారులకు పంపించారు.

భైంసాలో జాతీయ బీసీ కమిషన్​ పర్యటన

ఇదీ చూడండి:దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్‌ విచారణ

Last Updated : Feb 3, 2020, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details