నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం నాగపూర్ గ్రామ పంచాయతీలో నూతన రేషన్ డీలర్ల భర్తీ అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు.. గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. అధికారులు నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూకు హాజరయ్యారని గ్రామస్థులు తెలిపారు.
'రేషన్ డీలర్ల భర్తీ అవకతవకలపై విచారణ చేపట్టాలి' - ration dealers news in nagapur village
నూతన రేషన్ డీలర్ల భర్తీ అవకతవకలపై విచారణ చేపట్టాలని నిర్మల్ జిల్లా నాగపూర్ గ్రామస్థులు.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
!['రేషన్ డీలర్ల భర్తీ అవకతవకలపై విచారణ చేపట్టాలి' ration dealers fill ups in nagpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:33:21:1620637401-tg-adb-31-10-vicharanachepattali-av-ts10033-10052021134416-1005f-1620634456-50.jpg)
నాగపూర్‌లో రేషన్ డీలర్ల నియామకం
కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా మెరిట్ మార్కులు కేటాయించారని ఆరోపించారు. విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. మళ్లీ రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనం బారులు... రెండో డోసు కోసం నిరీక్షణ