శ్రావణమాసంలో చేసే పూజల్లో నాగేంద్రుని పూజకు చాలా విశిష్టత ఉంది. శ్రావణంలో వచ్చే 5వ రోజును ”నాగ పంచమి గాను గరుడ పంచమిగా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో నాగ పూజకి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఈ పంచమినాడు పుట్టలో పాలుపోసి తమ పిల్ల పాపాలని చల్లగ చూడాలని మహిళలు నాగదేవతకు తమ మొక్కులను చెల్లించుకుంటారు.
నిర్మల్లో ఘనంగా నాగపంచమి వేడుకలు
నాగపంచమి సందర్భంగా నిర్మల్ జిల్లాలోని నాగదేవత ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
నిర్మల్లో ఘనంగా నాగపంచమి వేడుకలు
ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని మామడ, చిట్యాల గ్రామంలోని నాగదేవత ఆలయాకు భక్తులు తెల్లవారు జాము నుంచే పూజలు నిర్వహిస్తున్నారు. పుట్టకు పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలుపోసి తమకు మొక్కులు తీర్చుకున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..