నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురపాకల కార్యాలయం పన్ను చెల్లింపుదారులతో కిటకిటలాడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో తమకు ఎలాంటి అప్పులేదని అభ్యంతర పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
పన్నులు చెల్లించేందుకు పుర ఆశావహుల పరుగులు - municipal tax collection is high in nirmal
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత పట్టణాల్లో భారీగా ఇంటి పన్నులు వసూల్ అవుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయంలో పన్నుల చెల్లింపునకు భారీ సంఖ్యలో ఆశావహులు తరలివచ్చారు.
నిర్మల్ భారీగా పురపాలక పన్నుల చెల్లింపు
పెండింగ్లో ఉన్న నల్లా, ఆస్తి పన్నులు చెల్లించేందుకు అనేక మంది అశావహులు పురపాలక కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. అభ్యంతరాలేమి లేకపోతే నామపత్రం తిరస్కరణకు గురవ్వదని ఆశావహులంతా ఉన్నపళంగా బకాయిలు చెల్లిస్తున్నారు.
TAGGED:
పురపాలక సంఘాలకు ఆదాయం..